ఇంటర్మీడియేట్ లో తెలంగాణ స్టేట్ ఫస్ట్ టాపర్ అంకిత కదం ఉషోదయ కళాశాల బోధన్ విద్యార్థినికి ఘన సన్మానం చేసిన MLA *
మార్చి 2024 ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాలలో 1000 మార్కులకు గాను 993 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన బోధన్ ఉషోదయ విద్యాసంస్థల విద్యార్ధిని కుమారి కదం అంకిత ను ముధోల్ MLA శాసన సభ్యులు రామారావు పటేల్
ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన ముధోల్ నియోజక వర్గ “ఉమ్రి గ్రామము, తానూర్ మండలం
విద్యార్ధిని అయిన కదం అంకిత దత్తహరి పాటిల్ ఇట్టి ఘనత సాధించడం ఆనందంగా ఉందని వెల్లడిస్తూ ఉషోదయ కళాశాల యాజమాన్యాన్ని మరియు విద్యార్థి తల్లి తండ్రులను అభినందించారు. ,చదువుల తల్లి సరస్వతి అమ్మ వారి కృపాకటాక్షముతో మరిన్ని ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని, MLA గా & కాకా గా తన సహకారం అన్ని వేళలా ఉంటుందని శుభాభివందనాలు తెలియజేసారు.