Breaking News
Saturday, July 27, 2024
Breaking News

ఆతిశీ చెప్పిన ఆ నలుగురిలో ఒకరికి ఈడి సమన్లు

- Advertisement -

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలకు ముందు తనతో పాటు మరో ముగ్గురు నేతలు అరెస్టు అవుతారంటూ ఆప్‌ నేత, దిల్లీ మంత్రి ఆతిశీ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ నలుగురిలో ఒకరైన దుర్గేశ్‌ పాథక్‌ కు దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో సోమవారం ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ రోజు మధ్యాహ్నమే హాజరుకావాలని వాటిల్లో పేర్కొంది. అదే సమయంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్
గత నెల అరెస్టయిన కేజ్రీవాల్‌ విచారణలో కీలక విషయాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. నిందితుడైన విజయ్‌ నాయర్‌ తన మంత్రి వర్గంలోని ఆతిశీ, సౌరభ్‌కు రిపోర్టు చేసేవాడని సీఎం పేర్కొన్నట్లు ఏఎస్‌జీ ఎస్‌వీ రాజు కోర్టుకు వెల్లడించారు. తమ పేర్లు బయటకు వచ్చిన నేపథ్యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు.  ‘‘నాతో పాటు సౌరభ్‌ భరద్వాజ్‌, దుర్గేశ్‌ పాథక్‌, రాఘవ్‌ చద్దా త్వరలో అరెస్టవుతారు’’ అని వ్యాఖ్యానించారు. తాజాగా పాథక్‌కు నోటీసులు వచ్చాయి. ఆయన రాజిందర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే.
ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్న కేజ్రీవాల్.. అక్కడి నుంచే సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మరోవైపు ఈ కేసులోనే అరెస్టయిన సంజయ్‌సింగ్‌.. ఆరు నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!