Breaking News
Saturday, July 27, 2024
Breaking News

మహిళల సంరక్షణకు ప్రథమ ప్రాధాన్యత

- Advertisement -

ఇంటింటా ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తం
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
బిజెపి, బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన 150 మంది మహిళలు

జగిత్యాల: మహిళల సంరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని అన్నారు.
జగిత్యాల మున్సిపల్ పరిధిలోని 10 వార్డు లింగంపేటలో సోమవార బీఆర్ఎస్, బిజెపి కి చెందిన 150 మంచి మహిళలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తుర్క రాజిరెడ్డి ఆధ్వర్యంలో జీవన్ రెడ్డి సమక్ష్మలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా  ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు విజయ లక్ష్మి దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన మహిళలకు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాలు ఇంటింటా అమలు చేస్తామని అన్నారు. మహిళాల సంరక్షణ కోసం చర్యలు చేపడుతామని అన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా పెళ్లి అయిన ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెలా రు.2500 అందజేస్తామని, కళ్యాణ లక్ష్మి 1 లక్ష నగదు తో పాటు పెళ్లి కుతురుకు తులం బంగారం కానుకగా  ఇస్తామన్నారు. మహిళలకోసం సిలిండర్ 500 లకే అందిస్తామన్నారు. గ్రామాల్లోని బెల్ట్ షాపులను మూసివేస్తమని  అన్నారు. రెషనకార్డు దారులకు తొమ్మిది రకాల వస్తువులు ఇస్తామన్నారు. రేషన్ కార్డులు నిరంతరం ఇస్తానన్నారు. ఇల్లు లేని నిరుపేదలకు రు 5 లక్షలు ఇంటి నిర్మనానికి  అందిస్తామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఇంటింటా ప్రచారం చేయాలని కార్యకర్తలు, నాయకులకు జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. మహిళలు కాంగ్రెస్ కు మద్దతు తెలుపాలని, రాబోయే ఎన్నికల్లో ఓటు వేసి ఆశీర్వదించాలని జీవన్ రెడ్డి కోరారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!