Breaking News
Friday, July 26, 2024
Breaking News

బైకులు, కార్లతో..  అనంతగిరిలో ఆకతాయిలు

- Advertisement -

నానాహంగామా సృష్టించిన వైనం..

పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి పర్యాటక ప్రాంతంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలుషితం చేస్తు అంతా మా ఇష్టం.. మమ్మల్ని అడిగేది ఎవరు అన్న చందంగా మద్యం తాగుతాం … ఇష్టారాజ్యంగా  వ్యవహరిస్తున్నారు.  తెలంగాణ ఊటీగా పిలవబడే అనంతగిరి అటవీ ప్రాంతానికి వారాంతపు సెలవుల్లో వేల సంఖ్యలో అనంతగిరి కి కుటుంబ సమేతంగా పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుని అనంతరం

With bikes, cars.. Hooligans in Ananthagiri
With bikes, cars.. Hooligans in Ananthagiri

అడవి అందాలని చూస్తూ ఆహ్లాదంగా గడుపుతారు. అయితే ప్రస్తుత పరిస్థితి పరిశీలిస్తే కొందరు టూరిజం పేరుతో అనంతగిరి కి వచ్చి దర్జాగా మద్యం వెంట తెచ్చుకొని విచ్చలవిడిగా తాగుతూ బైక్లు,కార్లతో స్టంట్ లు చేస్తూ వాతావరణాన్ని కలుషితం చేయడమే గాక ఇతర పర్యాటకులకు ఇబ్బంది

కలిగిస్తున్నారు.  వీళ్ళ ధీమా విషయానికొస్తే ఫారెస్ట్ లోకి ప్రవేశించినప్పుడు అటవీశాఖ అధికారులకు 20 రూపాయలు చెల్లిస్తే చాలు ఇక మేము ఏం చేసినా చెల్లుతుందని విర్రవీగుతున్నారు. ఇక అడవి శాఖ అధికారులేమో అనంతగిరి అభివృద్ధి పేరు చెబుతూ కాలం గడుపుతూ వచ్చిన వారి జేబులకు చిల్లులు పెడుతూ డబ్బులు తీసుకుని వచ్చిన వారిని పరిస్థితులు దాపురించడం దౌర్భాగ్యం. ఇంత జరుగుతున్నా అడిగే నాధుడే లేడు. తాజాగా మంగళవారం  పెద్ద ఎత్తున యువకులు బైకులు కార్లతో నానా హంగామా సృష్టించారు. వారి హంగామా చూసిన పర్యాటకులు స్థానికులు హాడలెత్తిపోయారు. ఇంత జరుగుతున్న ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నట్టు అని ప్రజలు మండిపడుతున్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!